calender_icon.png 16 October, 2024 | 12:35 AM

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిది

12-09-2024 07:42:59 PM

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి

తుంగతుర్తి, (విజయ క్రాంతి): నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు అనేకమంది తమ ప్రాణాలను అర్పించి భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాటం కొనసాగించారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సౌర్య యాత్ర గురువారం కొత్తగూడెం గ్రామానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా కామ్రేడ్ మాజీ ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన తర్వాత ఆయన మాట్లాడుతూ... తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఫలితంగా ఈ ప్రాంతంలో 10 లక్షల భూములను పేదవారికి పంచడం జరిగింది.

4000 మంది అమరవీరుల బలిదానంతో 3000 గ్రామాలు గ్రామ స్వరాజ్యాన్ని సాధించాయని అన్నారు. వారికి వత్తాసుగా ఉన్న దొరల ఆగడాలను ఎదిరించడం కోసం ఈ ప్రాంతంలో ఉన్న కమ్యూనిస్టు నాయకులు ప్రజలను చైతన్యపరిచి బాంచెంద్ దొర నీ కాలు మొక్కుతా అన్న బడుగు జీవులకు బంధువులు ఇచ్చి తిరుగుబాటు చేశారని దానివల్లనే నైజాములు మన ప్రాంతం నుండి పారిపోయారు. కానీ ఇప్పుడున్న బిజెపి పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు పోరాటం చేశారని మతాలకు రుద్దడం దురదృష్టకరమన్నారు.

ఇప్పటికైనా పాలకులు పేద ప్రజలకు మధ్యతరగతి వర్గాలకు ఉపయోగపడే చట్టాలను రూపొందించాలని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ప్రజా పాలన కొనసాగించాలని దోపిడిని నివారించే సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కొలిశెట్టి, యాదగిరిరావు జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్, పులుసు సత్యం, స్థానిక నాయకులు తాటి విజయమ్మ, పళ్ళ సుదర్శన్, ముత్తయ్య, మల్లయ్య, లింగయ్య, పాపయ్య తోపాటు ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్, కట్టా నరసింహ ఇతర కళాకారులు పాల్గొన్నారు.