calender_icon.png 15 October, 2024 | 11:28 PM

ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్ పి.ప్రావీణ్య

12-09-2024 07:30:22 PM

హనుమకొండ, (విజయక్రాంతి): వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల( ఈవీఎంల)ను భద్రపరిచిన గోదాములను హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య గురువారం అధికారులు, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాములను కలెక్టర్ పరిశీలించారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాంలకు సంబంధించిన రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించిన వివరాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాములను పరిశీలించిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... రికార్డుల నిర్వహణ, భద్రతా చర్యలు, సీసీ కెమెరాల  నిరంతర పర్యవేక్షణ, పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.