రోడ్డు విస్తరణ బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి: బీజేపీ
22-07-2026 01:31 AM
పెబ్బేరు, జూలై 21: వనపర్తిపెబ్బేరు ప్రధాన రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు తక్షణమే నష్టపరిహారం అందించి, పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు బాధితులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ గణేష్, చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్లకు వారు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ, బాధితుల వివరాల జాబితా సిద్ధమైందని, వచ్చే నెలలో అర్హులకు ఇంటి స్థలాలు కేటాయించే ప్రక్రియ చేపడతామని తెలిపారు. అలాగే రోడ్డు విస్తరణలో పూర్తిగా ప్రభావితమయ్యే ఇళ్లను దృష్టిలో ఉంచుకుని 38 అడుగుల వరకు సడలింపు ఇచ్చినప్పటికీ, ఆ పరిమితిని దాటి ఉన్న నిర్మాణాలను నిబంధనల ప్రకారం తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.






