20-01-2026 06:52:22 PM
మోతె,(విజయక్రాంతి): లిఫ్ట్ ఇరిగేషన్ కోసం భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని రావి పహాడ్ అప్పన్న గూడెం గ్రామ రైతులు మంగళవారం ఆర్ డి ఓ మాధవ రావు కు వినతిపత్రం అందించారు. రావి పహాడ్ గ్రామంలో రైతులతో ముఖా ముఖి ఏర్పాటు చేయడంతో రెండు గ్రామాల రైతులు సుమారు 58 మంది 17 ఎకరాల భూమి కోల్పోవడం తో ప్రభుత్వం సుమారు ప్రతి ఎకరానికి 15 లక్షల వరకు రైతులకు నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు ఆర్డిఓ తెలుపగ రైతులు అంగీకరించలేదని గ్రామ రైతులు తెలిపారు.
లిఫ్ట్ ఇరిగేషన్ కోసం భూములు కోల్పోయిన రైతులు మరోచోట భూమి కొనుగోలు చేయడానికి రైతులు కోరిన ప్రకారం ఎకరానికి 30 లక్షలు నష్ట పరి హారం చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ యం .వెంకన్న, డి టి పుష్ప, ఆర్ ఐ లు కర్ణాకర్ రెడ్డి, రమేష్ గ్రామ సర్పంచ్ లు సండ్ర ప్రసాద్, కోడి లింగయ్య, మాజీ సర్పంచ్ కోటేష్, కోట రామి రెడ్డి, కారింగుల శ్రీనివాస్, దిలీప్,తదితరులు పాల్గొన్నారు.