calender_icon.png 20 January, 2026 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతుల ప్రదానం

20-01-2026 06:49:45 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహిళలకు, చిన్నారులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మంగళవారం ఆసిఫాబాద్ పట్టణంలోని స్థానిక వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా వాసవి క్లబ్ అధ్యక్షుడు మర్యాల ఉదయబాబు మాట్లాడుతూ ముగ్గుల పోటీలో 31 మంది పాల్గొన్నారన్నారు. పండగ సంస్కృతి, రంగులు, డిజైన్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకోని ముగ్గురు న్యాయ నిర్నెతలు విజేతలను ఎంపిక చేసినట్లు తెలిపారు.

సీనియర్ విభాగంలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు జూనియర్ విభాగంలో సైతం తొలి మూడు స్థానాలకు బహుమతులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి శ్రీధర్, ఆలయ కమిటీ అధ్యక్షుడు రావుల శంకర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చిలివేరి వెంకటేశ్వర్లు, రావుల వెంకన్న, న్యాయ నిర్నేతలు సాయిని శ్రీదేవి, జ్యోతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.