20-01-2026 06:55:12 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): కొత్తపల్లి మండలం మల్కాపూర్-లక్ష్మీపూర్ లో మంగళవారం రోజున విడ్స్ స్వచ్ఛంద సంస్థ, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో సైబర్ నేరాల పైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రాజయ్య హాజరై మాట్లాడుతూ... ప్రస్తుతం అన్ని రంగాల్లో డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ సేవలు, విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయని, ఆన్లైన్ సేవల పేరుతో సైబర్ నేరాలు సైతం పెరుగుతున్నాయని అన్నారు. సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపులో వచ్చే లింకులను ఓపెన్ చేయొద్దని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్ కి ఫిర్యాదు చేయాలని కోరారు.తదుపరి స్థానిక ఐ ఓ బి బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ అనిల్ మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ సామాజిక భద్రత, పథకాల గురించి,బ్యాంకు సేవల గూర్చి తెలియజేశారు.