31-10-2025 12:46:37 AM
 
							బీజేపీ మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి
గోపాలపేట అక్టోబర్30: అకాల వర్షానికి వరి పంటలు దెబ్బతిని నేల వరి పంటలు నేల వ రిగాయిరిగాయి పంటల్లో నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలని బిజెపి మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అన్నారు. గురువారం గోపాలపేట మండలంలోని వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ. బిజెపి ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకం కింద వ్యవసాయ పంటల్లో నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు 15000 రూపాయలను ఇవ్వడానికి అమలు చేసిందని అన్నారు.
కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని అన్నారు. సన్నా చిన్న కారు రైతులు పంటల్లో తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తూ కనీసం ఒక ఎకరాకు పదివేల రూపాయలు అన్న ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కావాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు రేవల్లి మండల ఇన్చార్జి గంధం ప్రవీణ్ కుమార్ గారు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు వాలిదాసు సురేష్ గౌడ్ మండల కోశాధికారి అనురాగం మండల మాజీ మండల ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి గారు మండల కార్యవర్గ సభ్యులు ధర్మేందర్ గారు మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు రాజేందర్ గారు తదితరులు పాల్గొన్నారు.