11-11-2025 12:57:02 AM
- మొలకెత్తని సబ్సిడీ విత్తనాలు వార్త కథనం ప్రచురించిన ‘విజయక్రాంతి’
- విచారణ చేపట్టిన వ్యవసాయ అధికారులు
నంగునూరు, నవంబర్ 10: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ విత్తనాలు సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టం కలిగింది. 38 ఎకరాలలో 28 మంది రైతులు ఈ సబ్సిడీ విత్తనాలను సాగు చేశారు. విత్తనాలు మొలకత్తలేదని విషయాన్ని విజయక్రాంతి వార్త కథనం ప్రచురించింది. స్పందించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత కంపెనీలకు సిఫారస్ చేసింది. విత్తనాలు సాగు చేసిన వ్యవసాయ పొలాలను సందర్శించిన ఆయా కంపెనీల అధికారులు విత్తనాల లోపం ఉన్నట్లు గుర్తించారు పంట సాగుపై చేసిన పెట్టుబడిపై అంచనాలు పొందిస్తున్నట్లు తెలిపారు మరోసారి పూర్తిస్థాయి విచారణ జరిపి రైతులను ఆర్థికంగా ఆదుకుంటామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
విజయక్రాంతికి కథనంతోనే...
ప్రభుత్వం అందించిన సబ్సిడీ విత్తనాలను సాగు చేశాక అవి మొలకత్తలేదు దిక్కుతోచని స్థితిలో మేము విజయ క్రాంతిని ఆశ్రయించాం. వార్త కథనం ప్రచురించడంతో అధికారులు పరిశీలించారు దాంతో మాకు మేలు జరుగుతుందని విశ్వాసం పెరిగింది. అధికారులు త్వరగా పరిహారం ఇస్తారని ఆశిస్తున్నాం.
ఇటకల కోటి, బాధిత రైతు
కంపెనీలతో చర్చించాం.
సిద్దిపేట జిల్లాకు సబ్సిడీ విత్తనాలు సరఫరా చేసిన సంబంధిత విత్తన కంపెనీతో చర్చలు జరిగాయని, మొలకెత్తకపో వడం వల్ల నష్టపోయిన రైతులకు పెట్టుబడికి చేసిన ఖర్చులు, విత్తనాలు, దుక్కి, కౌలు ఖర్చులను నష్టపరిహారంగా చెల్లించాలని నిర్ణయించమన్నారు. పరిశోధన నిమిత్తం పంపిన విత్తనాలు మొలకెత్తలేదని నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. రైతులకు పరిహారం చెల్లింపు ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
స్వరూప రాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, సిద్దిపేట
అధికారులు పట్టించుకోలే..
సబ్సిడీ విత్తనాలు సాగు చేశాక అవి మొలకెత్తకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు, నాయకులు చుట్టూ తిరిగాం మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. దాంతో విజయక్రాంతి దినపత్రికను సాంప్రదిం చాగా వార్త కథనం ప్రచురీతమైతే తప్ప అధికారులు మా సమస్య వినలేదు. విచారణ జరిపిన అధికారులు పరిహారం కూడా త్వరగానే ఇస్తారని విశ్వాసం కలిగింది. రైతుల పక్షాన నిలిచినందుకు విజయక్రాంతికి కృతజ్ఞతలు.
ముడికే రాజయ్య, బాధిత రైతు.