11-11-2025 12:57:18 AM
163 ప్లాట్లకు 17,18 తేదీల్లో బహిరంగ వేలం
రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేదీ నవంబర్ 15
కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్
హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసిన లే అవుట్లలో నివాస భవనాల నిర్మాణానికి అనువైన ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. హైదరాబాద్ సమీపంలోని తొర్రూర్, బహూదూర్‌పల్లి, కుర్మల్‌గూడ ప్రాం తాల్లోని 163 ఓపెన్ ప్లాట్లను నవంబర్ 17, 18 తేదీల్లో బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం తెలిపారు.
ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. అవుటర్ రింగ్ రోడ్‌కు అతి చేరువలోని తొర్రూర్‌లో 200 నుంచి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న125 ప్లాట్లు, కుర్మల్‌గూడలో 200- -300 చదరపు గజాల విస్తీర్ణంలోని 25 ప్లాట్లు, బహదూర్ పల్లిలో 200- -1000 గజాల్లోని 13 ప్లాట్ల ను విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి వివాదాలు లేని, ఈ ప్లాట్లలో తమ అభిరుచులకు అను గుణంగా ఇండ్లను నిర్మించుకోవచ్చని, ఈ లే అవుట్లలో ఇప్పటికే మౌలిక వసతుల కల్పన కూడా పూర్తి అయ్యిందని ఎండీ చెప్పారు.
ఈ ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పెద్ద అంబర్ పేట్ లోని అవికా కన్వెన్షన్‌లో నవంబర్ 17,18 తేదీల్లో తొర్రూర్ ప్రాంతంలోని 125 ప్లాట్లకు, 18 వ తేదీ మధ్యాహ్నం నుంచి బహదూర్‌పల్లి, కుర్మల్ గూడలలోని ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు హైసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ పేర్కొన్నారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఓపెన్ ప్లాట్ల విక్రయాలపై అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నారని ఆయన తెలిపారు.
తొర్రూర్ లే అవుట్ లో ఉన్న 885 ప్లాట్లలో విడతల వారీగా ఇప్పటివరకు 517 ప్లాట్లను విక్రయించినట్లు, మిగిలిన వాటిలో ప్రస్తుతం 125 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాంతం లో గృహావసరాల భూములకు డిమాండ్ ఉండటంతో, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేప థ్యంలో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారని ఆయన తెలిపారు.