15 April, 2026 | 12:53 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అంతరిక్షమును నడిపేది కూడా ఆడపిల్లలే

04-02-2026 03:09 PM

చండూరు ఆర్డీవో శ్రీదేవి

మర్రిగూడ(విజయక్రాంతి): మర్రిగూడ మండల కేంద్రంలో కస్తూర్బా పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాలలో పిఆర్ఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో పదవ తరగతి కాంపిటేషన్ పుస్తకాలు బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చండూరు ఆర్డీవో శ్రీదేవి హాజరయ్యి మాట్లాడారు.  నాడు వంటగదిగే పరిమితం చేసిన సమాజంలో నేడు అదే ఆడపిల్లలు ఆకాశాన్ని దాటి అంతరిక్ష్యాన్నీ కూడా నడిపిస్తున్నారు. చదువు శాస్త్రం సాంకేతిక రంగాల్లో తమ సత్తా చాటుతూ మహిళలు అంతరిక్ష పరిశోధనలో కీలకపాత్ర పోషిస్తున్నారని, రాకెట్ ప్రయోగాల నుంచి ఉపగ్రహాల నియంత్రణ వరకూ మిషన్ డిజైన్ నుంచి డేటా విశ్లేషణ వరకు ప్రతి దశలోను మహిళా శాస్త్రవేత్తలు ముందుండి నడిపిస్తున్నారని గుర్తు చేశారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో మహిళా శాస్త్రవేత్తల భాగ్య సామ్యం దేశానికి గర్వ కారణమని చంద్రయాన్ మంగళయాన్ వంటి ప్రతిష్టాత్మక మిషన్లలో మహిళల పాత్ర చరిత్ర సృష్టించిందని ఆడపిల్లలు బలహీనులనే అపోహాలు చెరిపివేసి ఆకాశమే హద్దు కాదని నిరూపించుకోవాలని విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రభుత్వ పాఠశాలల నుంచి అత్యున్నత పరిశోధన కేంద్రాల వరకు మహిళలు సాధించాలని చదివితే ఒక కుటుంబమే కాదు ఒక దేశమే ఎదుగుతుందనే నినాదానికి  ఎదగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చెల్లం పాండురంగారావు తహసిల్దార్ శ్రీనివాస్ ఎంపీడీవో మున్నయ్య ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థినులు పాల్గొన్నారు.