calender_icon.png 4 February, 2026 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ ధర్నాకు తరలిన ఎస్టీయూ నేతలు

04-02-2026 03:04:24 PM

నిర్మల్,(విజయక్రాంతి): CPS రద్దు చేసి OPS విధానాన్ని అమలు చేస్తే ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చలో ఢిల్లీకి వెళ్తున్నట్టు జిల్లా అధ్యక్షులు భూమన్న యాదవ్ తెలిపారు. సీనియర్ ఉపాధ్యాయులకు TET నుంచి మినహాయింపు, SGT ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పింపు, జాతీయ విద్యా విధానం (NEP) పునఃపరిశీలన వంటి కీలక అంశాల సాధన కోసం ఫిబ్రవరి 5వ ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నట్టు వివరించారు. తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద AISTF ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా ధర్నాకు STUTS జిల్లా అధ్యక్షులు ఎస్.భూమన్న యాదవ్ నాయకత్వంలో 48 ఉపాధ్యాయులు ఢిల్లీకి తరలి వెళ్లారు.

ఢిల్లీకి తరలి వెళ్లిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి జె.లక్ష్మణ్, జిల్లా ఆర్థిక కార్యదర్శి బి.వెంకటేశ్వర్ రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నాంపల్లి నాగభూషణ్, రాష్ట్ర కార్యదర్శి ఎ. బాజారెడ్డి, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు పలిశీకర్ శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు  పోలీస్ కర్ గంగాధర్, పిప్పర శీనివాస్, వాల్ గోట్ శ్రీనివాస్,  నారాయణ, ఎం. శ్రీనివాస్, రాజ మహేందర్, వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాలాజీ, రవి జాదవ్, ఏం .సి.నరసయ్య, టి. రవి, గంగాధర్, లక్ష్మీనారాయణ, భూమేష్ మరియు ఎన్సిసి శ్రీనివాస్, సతీష్, విశ్వేశ్వర్ రెడ్డి, తదితరులు బయలుదేరారు