calender_icon.png 10 January, 2026 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చర్చ ఏది?

08-01-2026 01:49:13 AM

బీసీ జేఏసీ చైర్మన్  జాజుల శ్రీనివాస్ గౌడ్  

హైదరాబాద్, జనవరి 7(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఏమైందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఐదు రోజులు అసెంబ్లీ సమావేశాలు నడిచినప్పటికీ బీసీ రిజర్వేషన్లపై కనీసం చర్చించకపో వడం చాలా బాధాకరమన్నారు.

బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీ వేదికగా చర్చించి రిజర్వేషన్లపై కేంద్ర పైన ఒత్తిడి పెంచడానికి ఒక రాజకీయ కార్యాచరణ ప్రకటించాలని మొదటి నుంచి బీసీలు డిమాండ్ చేస్తున్నా, అన్ని రాజకీయ పార్టీల నేతలు కలిసి విజ్ఞప్తి చేసినా అసెంబ్లీలో మాత్రం ప్రతిపక్షాలు మౌనం పాటించాయన్నారు. అధికార పార్టీ తన బాధ్యత మర్చిపోయిందని ఆయన అన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా రాష్ట్ర ప్రభు త్వం ఎన్నికలు నిర్వహించిన బీసీ సమాజం ఒప్పుకునే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు.

బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష పార్టీలు బీసీ సంఘాలతో సమావేశం ఏర్పా టు చేయాలని, బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఒకవైపు న్యా యపోరాటం, ఇంకొక వైపు రాజకీయ పోరా టం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన కోరారు. బీసీల ఆకాంక్షలు విస్మరిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బీసీలు తిరుగుబాటు చేస్తారని, వచ్చే ఎన్నికల్లో బీసీ వ్యతిరేక పార్టీలకు బుద్ధి చెబుతామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.