calender_icon.png 28 October, 2025 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి

28-10-2025 12:30:48 AM

డీసీపీ ఎగ్గడి భాస్కర్

బెల్లంపల్లి, అక్టోబర్ 27 : ఫిర్యాదుదారులతో పోలీసులు మర్యాదగా ప్రవర్తించాలని మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్ అన్నారు. సోమవారం బెల్లంపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. రౌడీ షీటర్స్, హిస్టరీ, అనుమానితులపై నిఘా పెంచాలని ఎస్సై బండి రామకృష్ణను ఆదేశించారు.

మత్తు పదార్థాలు, గంజాయి, సైబర్ నేరాలు, ఫోక్సో చట్టం, షీ టీంలో పనితీరు, 100 డయల్ సేవలపై ప్రజలకు అవ గాహన కల్పించాలని సూచించారు.

పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నా రు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. డిసిపి వెంట బెల్లంపల్లి ఏసిపి ఏ. రవికుమార్, బెల్లంపల్లి రూర ల్ సీఐ సిహెచ్ హనూక్ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.