28-10-2025 12:32:31 AM
ఎస్పీ కాంతిలాల్ పాటిల్
కుమ్రం భీంఆసిఫాబాద్, అక్టోబర్ ౨౭ (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమ త్తంగా ఉండాలని ఎస్పి కాంతిలాల్ పాటిల్ ప్రజలకు సూచించారు. గుర్తుతెలియని వ్యక్తు లు ఆన్లైన్ ద్వారా లింకు పంపించి డబ్బులు కాజేసిన కేసులో ఆసిఫాబాద్ పోలీసులు ఇద్ద రు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ పంపించారు. ఎస్పీ కాంతిలాల్ పాటిల్,ఏ ఎస్ పి చిత్తరంజన్ తెలిపిన వివరాల ప్రకారం ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తులు చేసిన ఫిర్యా దు మేరకు సీఐ బాలాజీ వరప్రసాద్,సైబర్ క్రైమ్ బృందం చేపట్టిన ఇన్వెస్టిగేషన్ ఆధారంగా అకౌంట్‌ను ట్రేస్ చేసి గుర్తించారు.
గుజరాత్ రాష్ట్రానికి చెందిన పంకాజ్ భాయ్, సల్లు శైలేష్‌లు ఆన్లైన్ మోసానికి పాల్పడడంతో వారిని అరె స్టు చేసి ఆసిఫాబాద్ కు తరలించారు.వారి వద్ద ఉన్న రెండు సె ల్ ఫోన్లతో పాటు రూ: 3.47లక్షల ను రికవరీ చేసినట్లు తెలిపారు.ప్రజలు సోషల్ మీడియా లేదా వాట్సా ప్ లింకుల ద్వారా వచ్చే ఆఫర్ల ను నమ్మే క్లిక్ చేయకూడదని కోరారు.
ఇలాంటి లింకులు వచ్చినవో వాటిని నిర్ధారించుకుని మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు.సైబర్ మోసాలు ఎదురైతే 1930 హెల్ప్ లైన్ నెంబర్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపారు. సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి కృషిచేసిన ఆసిఫాబాద్ సీఐ, సైబర్ క్రైమ్ బృందాన్ని అభినందించారు.