28-10-2025 12:30:45 AM
నవంబర్ 8 వరకు పాల్గొననున్న రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకం గా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్‌లను హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఆరు రోజులు రోడ్‌షో నిర్వహించనున్నారు. రాతి 7 నుంచి 8 గంటల వరకు రోజుకు రెండు డివిజన్లలో రోడ్ షోలు నిర్వహించనున్నారు. ఈ నెల 31, నంబవర్ 1,4,5,8,9 తేదీల్లో సీఎం రోడ్‌షోలు నిర్వహించి, కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతారు. ఈ నెల 31న వెంగళరావునగర్, సోమాజిగూడ, నవంబర్1న బోరబండ, ఎర్ర గడ్డ, 4న షేక్‌పేట్-1 , రహమత్‌నగర్, 5న షేక్‌పేట్-2, యూసుఫ్ గూడ, 8న 6వ డివిజన్‌లో బైక్ ర్యా లీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, ౯న షేక్‌పేటలో బైక్ ర్యాలీ ఉదయం 10 గంటలకు.