బెదిరింపులపై ఫిర్యాదు
నాగర్‌కర్నూల్, మే 20 (విజయక్రాంతి): బెల్టుషాపు తొలగించమన్నం దుకు దుకాణ యజమాని బెదిరింపులకు పాల్పడుతున్నాడని, అతడి నుం చి తమకు రక్షణ కల్పించాలని సోమవారం బాధితులు జిల్లాకేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ రామేశ్వర్‌కు ఫిర్యాదు చేశాడు. తెలిసిన వివరాల ప్రకారం.. నల్లవెల్లి రోడ్డులోని చర్చి ప్రాంతంలోని ఇండ్ల మధ్య ఓ వ్యక్తి టీ దుకాణం నడుపుతూ అనధికారికంగా మద్యం విక్ర యిస్తున్నాడు.
అక్కడ మద్యం తాగిన మందుబాబులు స్థానికులతో గొడవలకు దిగుతున్నారని, తరచూ గొడవల కారణంగా తాము ఇబ్బంది పడుతున్నామని కొందరు దుకాణ యజమా నిదృష్టికి సమస్యను తీసుకెళ్లారు. అయినా దుకాణ నిర్వాహకుడి నుంచి ఎలాంటి స్పందన లేదు. పైగా బెదిరింపులకు దిగాడు. అనంతరం స్థానికులు పోలీసులను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో బాధితులు ఏఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.






