క్రీడాకారుడికి ప్రభుత్వ విప్ అభినందన
21-05-2024 02:03 AM
జగిత్యాల, మే 20 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం సిరికొండ గ్రామానికి చెందిన పంచిత హరికృష్ణ ఇటీవల జరిగిన ఇంటర్ నేషనల్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించగా.. ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. హరికృష్ణను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.






