9 April, 2026 | 3:15 PM

మల్లికార్జున ఖర్గేపై కఠిన చర్యలు తీసుకోండి.. పోలీసులకు తాండూర్ బీజేపీ నాయకులు ఫిర్యాదు

09-04-2026 01:41 PM

తాండూరు,(విజయక్రాంతి): రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) భారతీయ జనతా పార్టీ (బిజెపి) ని ఉద్దేశించి ముస్లింలను మతవిద్వేషాలను రెచ్చగొడుతూ దేశంలో మతకల్లోలాలను సృష్టించే విధంగా సభాముఖంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వాక్యాలపై  కేసు నమోదు  చేసి చట్టపరంగా కఠిన చర్యలు  తీసుకోవాలని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ అధ్యక్షులు,  మున్సిపల్ కౌన్సిలర్ నాగారం మల్లేశం ఆధ్వర్యంలో  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్  రాష్ట్ర మహిళా నాయకులు సాహు శ్రీలత , బంటారం భద్రేశ్వర్, మున్సిపల్ కౌన్సిలర్లు అంతారం కిరణ్ కుమార్ డి శ్రీకాంత్ రెడ్డి జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు బండారు శ్రీకాంత్ పట్టణ ప్రధాన కార్యదర్శి మంతటి రాజు ఉపాధ్యక్షులు దోమ కృష్ణా కందనేలి సంగమేశ్వర్ ఇందూర్ రాములు మైనార్టీ మోర్చా  పట్టణ అధ్యక్షుడు షాబుద్దీన్ చందు ప్రభాకర్ గౌడ్ బబ్లు చాకలి బిచ్చప్ప చౌదరి  బిచ్చప్ప  బస్వరాజ్ పద్దు వడ్డే సాయిలు సంతోష్ కుమార్ కార్యకర్తలు అభిమానులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.