ఉపాధి హామీ పనుల్లో అవకతవకలపై ఎంపీడీవోకు ఫిర్యాదు
19-06-2026 12:01 AM
ఎర్రవల్లి, జూన్ 18: మండలంలోని బీచుపల్లి గ్రామ పంచాయతీ పరిధి కొండపేటలో ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు జరిగాయని గ్రామస్థులు ఎంపీడీవో మహేష్కు ఫిర్యాదు చేశారు. ఈడుగోని కుంట నుంచి కృష్ణా నది వరకు కాలువ పనులు చేయకుండానే రికార్డుల్లో చూపించి, కూలీలకు హాజరు వేసి బిల్లులు పొందారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కాలువ పూడిక పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.






