ప్రజావాణికి 108 ఫిర్యాదులు
ఇబ్రహీంపట్నం, జూన్ 29 (విజయక్రాంతి): సోమవారంరంగా రెడ్డి జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి (108) ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి సమస్యలను జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) కిరణ్మయి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి తో కలిసి అర్జీలు స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.రెవెన్యూ శాఖ20, ఇతర శాఖలు 88, మొత్తం దరఖస్తులు అందాయి. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అనంత రెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు..






