ప్రజావాణికి 103 ఫిర్యాదులు
ఇబ్రహీంపట్నం, జులై 13 (విజయక్రాంతి): ప్రజల వినతులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో మొత్తం (103) ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కో సం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు సమర్పించిన వినతులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, గడువులోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.






