27 July, 2026 | 6:55 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి

29-07-2025 01:42 AM

రెవెన్యూ ఆదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ 

నల్లగొండ టౌన్, జూలై 28 : ప్రజావాణి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని రెవెన్యూ ఆదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమ్మిళిత సమావేశంలో ఆయన మాట్లాడుతూ విపత్తు నిర్వహణకు సంబంధించి ఆయా శాఖలు వారి కార్యాచరణ ప్రణాళికను వారం రోజుల్లోగా సమర్పించాలని ఆదేశించారు.

ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని, ఒకవేళ సమస్య పరిష్కారం కానట్లయితే సంబంధిత ఫిర్యాదు దారుకి తెలియజేయాలని,  డివిజన్ ,మండల గ్రామస్థాయిలో సైతం ఇదేవిధంగా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు.కాగా ఈ సోమవారం  130 ఫిర్యాదులు రాగా, జిల్లా అధికారులకు 61, రెవెన్యూ శాఖకు 69 ఫిర్యాదులు వచ్చాయి. స్పెషల్ కలెక్టర్ సీతారామారావు, జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.