calender_icon.png 31 July, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ సర్కార్

29-07-2025 01:40:36 AM

మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్

శాలిగౌరారం, జులై 28 : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల అమలులో లో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని,అబద్దాల పునాదు ల పై కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ దే విజయమని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో జీ బీ ఎం ఫంక్షన్ హాల్ లో జరిగిన బీ ఆర్ ఎస్ పార్టీ సన్నాహక సమావేశం లో  పాల్గొని ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఫెయిల్ అయ్యాయని అన్నారు.

సుపరి పాలన అందిస్తారని ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే అబద్దాలతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నా రని ఏద్దేవా చేశారు.  తెలంగాణ జాతి పిత ఐన కే సి ఆర్ పై మరొకసారి కే సీ ఆర్ పై అనుచిత వాక్యలు చేస్తే వారి స్థాయి ఎంతటి దైన వారి నాలుక ను చీరేస్తామని హెచ్చరించారు.  బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు ఐతగోని వెంకన్న గౌడ్,మాజీ అధ్యక్షులు కట్టా వెంకటరెడ్డి,మామిడి సర్వయ్య,గుండా శ్రీనివాస్,చాడ హతీష్ రెడ్డి, గుజిలాల్ శేఖర్ బాబు,జేరిపోతుల చంద్రమౌళి, కల్లూరి నాగరాజు, దుబ్బ వెంకన్న,మహేశ్వరం వెంకన్న, మామిడి రమేష్  పాల్గొన్నారు.