19 August, 2026 | 4:36 PM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సత్వారం పూర్తి చేసుకోండి

19-08-2026 04:01 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని సాకేర గ్రామంలో బుధవారం నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఎంపీడీవో రత్నాకర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులను కలిసి ఇండ్ల నిర్మాణం సత్వరం పూర్తి చేసుకుంటే సకాలంలో బిల్లులు చెల్లించడం జరుగుతుందని లబ్ధిదారులకు వివరించారు. అంతేగాక మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయితే రెండవ విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆయన వెంట పాయా గ్రామాల లబ్ధిదారులు ఉన్నారు.