18 April, 2026 | 7:30 PM

ప్రజలకు అందుబాటులో పోలీస్ శాఖ

20-06-2025 12:00 AM

ఎస్పీ జానకి షర్మిల 

నిర్మల్, జూన్ 19 (విజయక్రాంతి): నిర్మ ల్ జిల్లాలో వానాకాలం సీజన్లో విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సిద్ధం గా ఉన్నట్టు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. గురువారం నిర్మల్ పట్టణంలోని బంగల్పెట్ వినాయకసాగలో ఎన్‌టిఆర్‌ఎఫ్ బృందాలతో వరదల వల్ల ప్రజలకు రక్షణ కల్పించే అంశాలపై నిర్వహించిన ప్రదర్శనలు పాల్గొ ని సిబ్బందికి సూచనలు అందించారు.

పోలీ స్ శాఖ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఏ సాయం అడిగిన తప్పకుండా ఆ సహాయానికి సిద్ధంగా ఉండడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఎస్పీలు అవి నాష్ కుమార్ ఉపేందర్‌రెడ్డి పోలీస్ సిబ్బం ది ఉన్నారు.