calender_icon.png 21 February, 2026 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగిపోయిన నాలా పనులు పూర్తి చేయండి

21-02-2026 12:00:00 AM

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

బడంగ్పేట్, ఫిబ్రవరి 20: మధ్యంతరంగా ఆగిపోయిన ఎస్‌ఎన్డీపీ నాలా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారు లను ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభం అయ్యేలోపే ఈ పనులన్నీ ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ చంద్రకళ,

డీసీపి సరస్వతి, వివిధ శాఖల అధికారులతో కలిసి నాలాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీ క్షా సమావేశం నిర్వహించారు. త్రాగునీటి సరఫరాపై ఆదేశాలు నాలా పనులతో పాటు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గ ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో ఎస్‌ఈ కిష్ట ప్ప, ఎస్‌ఎన్డీపీ ఈఈ వరలక్ష్మి, డీఈ అంజుమ్ సుల్తానా, డీఈ వెంకన్న పాల్గొన్నారు.