calender_icon.png 21 February, 2026 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జలమండలి క్షేత్రస్థాయిలో సమస్యల వేట

21-02-2026 12:00:00 AM

  1. వారంలో నాలుగు రోజులు బస్తీల్లోనే అధికారులు  

నీటిని వృథా చేస్తే పెనాల్టీ తప్పదు: ఎండీ అశోక్ రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి):మున్సిపల్ సేవలను ప్రజల ముంగిటకే చేర్చాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జలమండలి శుక్రవా రం జలమండలి బస్తీ బాట కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించింది. అధికారులు నేరుగా బస్తీల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవాలన్న సీఎం లక్ష్యానికి అనుగుణంగా జలమండలి ఎండీ నుంచి వార్డు మేనేజర్ వరకు అందరూ వేకువజామునే క్షేత్రస్థాయిలోకి దిగారు.

ఉదయం 6 గంటలకే నగరంలోని వివిధ డివిజన్లలో ఉన్నతా ధికారులు పర్యటించి నీటి సరఫరా, మురుగునీటి సమస్యలపై స్వయంగా ఆరా తీశారు. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి శుక్రవారం తెల్లవారుజామునే శేరిలింగంపల్లి వార్డు పరిధిలోని శంకర్ నగర్, హుడా కాలనీ, దీప్తి శ్రీ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. శంకర్ నగర్‌లో నీటి సరఫరా అవుతున్న సమయంలో నేరుగా ఇళ్లకు వెళ్లి నీటి నాణ్యతను, పీడనాన్ని పరిశీలించారు.

ఈ క్రమంలో ఓ ఇంటి యజమాని తాగునీటితో ఇంటి ప్రాంగణా న్ని కడుగుతుండటాన్ని గమనించిన ఎండీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విలువైన తాగునీటిని వృథా చేయడం సరికాదని, ఇలాంటి పనులకు వస్త్రాన్ని మాపు వాడాలని హితవు పలికారు. మళ్లీ తాగునీటిని వృథా చేస్తే భారీ జరిమానా విధిస్తామని యజమానిని హెచ్చరించారు. మరో ఇంట్లో వృథా నీటిని భూమిలోకి మళ్లించేలా ఇంకు డు గుంతను నిర్మించుకోవాలని సూచించారు.

మియాపూర్ ప్రధాన రహదారిపై మురుగునీరు పొంగుతున్న ఫిర్యాదును ఎండీ పరిశీలించారు. కొత్తగా రోడ్డు వేసే సమయంలో ఇతర శాఖల వారు మ్యాన్హోళ్లను మూసివేయడం వల్లే ఈ సమస్య తలె త్తుతోందని అధికారులు వివరించారు. దీని పై స్పందించిన ఎండీ ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని మ్యాన్‌హోళ్లను గుర్తిం చాలని, అప్పటివరకు మురుగునీటిని ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రంక్ మెయిన్‌కు మళ్లించాలని ఆదేశించారు.

జలమండలి జాయింట్ ఎండీ మయాం క్ మిట్టల్ ఎస్‌ఆర్ నగర్ డివిజన్ పరిధిలోని కైలాశ్ నగర్లో పర్యటించారు.  సైబరాబాద్ రీజియ న్ ఈడీ సంతోష్ కేపీహెచ్బీ కాలనీలో, మల్కాజ్గిరి రీజియన్ ఈడీ పంకజ రామంతాపూర్లో పర్యటించి ప్రజల ఫిర్యాదులను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎండీ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం ఆదేశాల మేరకు ఇకపై ప్రతి మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 7 నుండి 10 గంటల వరకు అధికారులు బస్తీల్లోనే ఉంటారని స్పష్టం చేశారు. నీటి నాణ్యత, మురుగునీటి పారుదల మెరుగుపరచడమే కాకుండా, భూగర్భ జలాల పెంపునకు ప్రజల్లో అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ పర్యటనలో ఆపరేషన్ డైరెక్టర్లు వినోద్ భార్గవ, నారాయణ, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.