19 March, 2026 | 3:33 AM

ప్రభుత్వ పరంగా ఈదుల్ ఫితర్ నమాజ్ కోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు

19-03-2026 12:09 AM

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్, మార్చి 18 (విజయ క్రాంతి): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఆచరించే ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ ఏర్పాట్లను ప్రభుత్వ పరంగా నగరంలోని అన్ని ఈద్గాలలో ప్రభుత్వపరంగా ఏర్పాట్లను పూర్తిస్థాయిలో చేస్తున్నట్లు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు.

బుధవారం పోలీసు కమిషనర్ గౌష్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అంజన్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ సోహం, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, ఎంఐఎం కాంగ్రెస్ కార్పొరేటర్లతో కలిసి ఆయన రేకుర్తి సాలెహ్ నగర్ చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈద్-ఉల్-ఫితర్ రమజాన్ నమాజ్ ఆచరించేందుకు సుమారు 25వేల మంది పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు తరలిరానున్న నేపథ్యంలో ప్రభుత్వపరంగా చేస్తున్న ఏర్పాట్లు, వసతులు అందరికీ సౌకర్యవంతంగా చేశామని చెప్పారు. ప్రభుత్వ పరంగా సకల ఏర్పాట్లను చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులు శ్రీధర్ బాబుకు, పొన్నం ప్రభాకర్లకు, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డికి గులాం అహ్మద్ కృతజ్ఞతలు తెలిపారు.

ట్రాఫిక్ ఏర్పాట్లపై పోలీసు అధికారులతో, సిపి గౌష్ ఆలం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నేతలు సయ్యద్ బర్కత్ అలీ, అబ్బాస్ సమీ, కార్పొరేటర్లు మొహసీన్ మొహియుద్దీన్, మాజిద్ హుస్సేన్, సయ్యద్ బియబాని ఇబ్రహీం, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, రేకుర్తి కార్పొరేటర్ మాధవి కృష్ణ గౌడ్, నాయకులు నాయకులు బాబుజానీ, సురేష్, రాజు, షబ్బీర్, యాఖూబ్, మజారోద్దీన్, ఇక్రామ్ సికిందర్, ఇమ్రాన్, వసీం,  తదితరులు పాల్గొన్నారు.