19 March, 2026 | 5:02 AM

మొక్కజొన్న రైతుల పరిస్థితేంటి?

19-03-2026 12:08 AM

మండలిలో ఎమ్మెల్సీ ఎల్ రమణ 

జగిత్యాల, మార్చి 18 ( విజయక్రాంతి ) :డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల రవాణా సౌకర్యాలు, మౌ లిక వసతులు మరియు రైతుల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు,ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12వేలు ఎప్పుడూ ఇస్తారు అని శాసనమండలి సభలో  ఎమ్మెల్సీ ఎల్ రమణ డిమాండ్ చేశారు.

బుధవారం రోజున శాసనమండలి సమావేశంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సం స్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గం జగిత్యాల పట్టణంలో గత  ప్రభుత్వం నిరుపేదలందరికీ పక్కా ఇండ్లు ఉండాలని ఉద్దేశించి మాజీ సీఎం కేసీఆర్  ప్రభుత్వంలో పేద ప్రజలందరిని ఉద్దేశించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించడం జరిగింది.

దానిలో భాగంగా జగిత్యాలకు అతి చేరువలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జగిత్యాల పట్టణంలో డబుల్ బెడ్రూంలో ఇళ్లను నిర్మించడం జరిగిందని, కానీ ఈ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ లో నివసిస్తున్న ప్రజలకు ఇప్పటివరకు వారికి సరియైన మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు లేకపోవడం చాలా బాధాకరం మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ బూత్ లేకపోవడం వల్ల అక్కడ నివసిస్తున్న

ప్రజలు ఓటు వేయడానికి కూడా రావడానికి ఇబ్బంది పడడం జరిగిందన్నారు.కావున దయచేసి  వెనువెంటనే నూక పెళ్లి డబుల్ బెడ్ రూమ్ అర్బన్ కాలనీ వాసులకు త్రాగునీరు, డప్పింగ్ యాడ్ సమస్య,తో చర్మవ్యాధుల సమస్యలు అనారోగ్యాల బారిన పడుతున్నారని  మౌలిక వసతులు మరియు రవాణా సౌకర్యాలు కల్పించాలని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం సంతోషం కానీ ప్రభుత్వం స్వయంగా చెప్పినటువంటి, హామీ ఇచ్చిన విషయాలకు అనుగుణంగా ఆటో డ్రైవర్లకు,ఆటో ఓనర్లకు సంవత్సరానికి గాను 12వేల రూపాయలు ఇస్తా అని అన్నారు. అది ఎప్పుడూ ఇస్తారు ఎప్పుడూ మొదలుపెట్టిస్తారు?జగిత్యాల నియోజకవర్గం లోని రాయికల్,

సారంగాపూర్ మండలాల్లో మొక్క జొన్న పంటల కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఇటీవల వడగళ్ల వానలకు రైతుల పంట నష్టానికి కారణమైనది కావున వెంటనే ప్రభుత్వం రైతుల పంట నష్టానికి కారణం కాకుండా రైతులకు పంటను విక్రయించు కోవడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అని ఎమ్మెల్సీ ఎల్ రమణ శాసన మండలి సభలో స్పీకర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.