24 August, 2026 | 10:22 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

సమగ్ర ఆరోగ్య పరీక్షల శిబిరం విజయవంతం

24-06-2025 11:49 PM

మంచిర్యాల (విజయక్రాంతి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని సాయికుంట బస్తీ దవాఖాన వద్ద మంగళవారం టీబీ ముక్త్ భారత్ అభియాన్(TB Mukt Bharat Abhiyan) సమగ్ర ఆరోగ్య పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో క్షయ వ్యాధి, హెచ్‌ఐవి ఎయిడ్స్, మధుమేహం, రక్తపోటు హెపటైటిస్ తదితర వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన వారికి చికిత్సలు అందించారు. 45 మందిని అనుమానించి ఎక్స్ రే కోసం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ శిబిరంలో వైద్యులు డాక్టర్ అమన్, డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ రామకృష్ణ, సి హెచ్ ఓ లు వెంకటేశ్వర్లు, రామ్మూర్తి, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, సబ్ యూనిట్ అధికారి నాందేవ్, హెపటైటిస్ వ్యాధి పర్యవేక్షకులు మధు, సి ఓ అపర్ణ, టి బి హెచ్ వి స్వప్న, మొబైల్ ఐ సి టి సి కౌన్సిలర్ శ్రీలత, ల్యాబ్ టెక్నీషియన్ లు తదితరులు పాల్గొన్నారు.