సమగ్ర శిక్షణ ఉద్యోగులని రెగ్యులర్ చేయాలి
మునుగోడు (విజయక్రాంతి): సమగ్ర శిక్షణ ఉద్యోగులందరికీ రెగ్యులర్ చేసి, తమ డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ఆ సంఘం నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శనివారం తెలంగాణ సర్వ శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని స్థానిక మండల వనరుల కేంద్రం ముందు విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు రెండవ రోజు నిరసన దీక్షలు చేపట్టారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన దీక్షకు ఉపాధ్యాయ సంఘాలు. పీఆర్టియు, టీపియుఎస్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని లేనిపక్షంలో 10వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు వెళ్తామని తెలియజేశారు.
సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే క్రమబద్దీకరణ చేయాలని అన్నారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు మేడి సావిత్రి మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికి జీవిత భీమా 10 లక్షలు, ఆరోగ్య భీమా 10 లక్షల సౌకర్యం కల్పించాలని, పదవి విరమణ చేస్తున్న వారికి చేసిన బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ కళావతి చేశారు. పీఆర్టియు మండల అధ్యక్షులు సయ్యద్ యూసఫ్ పాషా, ప్రధాన కార్యదర్శి అన్నెపురెడ్డి, టీపియుఎస్ మండల అధ్యక్షులు మిర్యల మురళీ, ఎస్సి ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సంకు లింగయ్య, వెంకటేశ్వర్లు, చంద్రం, జిల్లా బాధ్యులు వళి పాషా, సత్తి రెడ్డి, కార్యదర్శి జి.నరసింహా ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా బాధ్యులు గండమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎంఐఎస్ దివ్య, ఐఈఆర్పి ఇందిర, కస్తూర్బా గాంధీ పాఠశాల ఉపాధ్యాయులు సీఆర్టి భారతి ప్రసన్న రాణి, నాగమణి, సభిత, పీజీ సీఆర్టీ కవిత, ఏఎన్ఎం శైలజ, డే వాచ్ ఉమెన్ ఇందిరమ్మ, పిటిఐ లు అంజయ్య , శైలజ, సీఆర్పీ సైదులు, సతీష్, నరసింహా తదితరులు పాల్గొన్నారు.




