30-07-2025 06:35:20 PM
బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ మండలం(Banswada Mandal) తాట్కోల్ ఉన్నత బాలుర పాఠశాలలో నాలుగు కంప్యూటర్లు అపహరణకు గురయ్యాయి. స్టోర్ రూమ్ తాళం వేసి ఉన్నప్పటికీ, ఈనెల 22న కంప్యూటర్లు మాయమైనట్లు హెచ్.ఎం శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తుండగా, పోలీసులు ఇంటి దొంగల కోణంలోనూ విచారణ చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.