calender_icon.png 31 July, 2025 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

30-07-2025 06:29:54 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఉపాధ్యాయుల సమస్యల  పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు గిరిజన సంక్షేమ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్(District President Rathod Ravinder) అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో జిల్లా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో గిరిజన శాఖలో పనిచేస్తున్న ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు వివరించారు. ఉపాధ్యాయులు సంఘటితంగా ఉన్నప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఆదిశగా తమ సంఘం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల భద్రాచలంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీలో జిల్లాకు చెందిన పలువురికి అవకాశం రావడంపై అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగం జిల్లా ప్రధాన కార్యదర్శి మడావి గోపాల్, కోశాధికారి కుడ్మేత అనంత్, పీజీ హెడ్ మాస్టర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నైతం కృష్ణరావ్, జిల్లా కార్యదర్శులు కుమురం మాధవరావ్, వెడ్మ యస్వంత్ రావ్ పాల్గొన్నారు.