calender_icon.png 4 October, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామ్రేడ్ కళ్యాణ్

04-10-2025 12:36:39 AM

హీరో శ్రీవిష్ణు విభిన్న కథలతో అలరిస్తుంటారు. ఆయన తాజా ప్రాజెక్ట్ కూడా అదే రీతిలో వినోదం అందించబోతున్నారు. ఆయన కథానాయకుడిగా ‘కామ్రేడ్ కళ్యాణ్’ అనే టైటిల్తో వస్తున్న ఈ ఫన్ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రానికి జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్పీ బ్యాన్ప నిర్మిస్తున్నారు. టైటిల్ను పరిచయం చేస్తూ విడుదల చేసిన ప్రోమో ఆసక్తికరంగా ఉంది.

1992లో ఆంధ్రఒడిశా సరిహద్దులోని విశాఖ జిల్లా మాడుగుల గ్రామం నేపథ్యంలో సాగే ఈ కథ. ఈ సినిమాలో శ్రీ విష్ణు డ్యుయల్ రోల్స్లో కనిపించనుండగా హీరోయిన్గా మహిమా నంబియర్ నటిస్తోంది. రాధికా శరత్కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమయే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్; డీవోపీ: సాయిశ్రీరామ్; ఎడిటర్: ఛోటా కే ప్రసాద్.