04-10-2025 12:37:34 AM
నాని హీరోగా 34వ సినిమా ప్రారంభమైంది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వెంకట్ బోయనపల్లి (నిహారిక ఎంటర్టైన్మెంట్), నాని స్వంత నిర్మాణ సంస్థ యూనానిమస్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. దసరా సందర్భంగా ఈ సినిమా ప్రారంభ వేడుకను నిర్వహించారు. విక్టరీ వెంకటేశ్ హాజరై, ఫస్ట్ క్లాప్ కొట్టారు. హీరో నాని తండ్రి రాంబాబు ఘంటా కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నాని, నిర్మాత వెంకట్ బోయనపల్లి కలిసి స్క్రిప్ట్ను దర్శకుడు సుజీత్కి అందించారు. ఫస్ట్ షాట్ కి దర్శకులు రాహుల్ సంకృత్యాన్, శ్రీకాంత్ ఓదెల, శౌర్యువ్ కలిసి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ వేడుకకు పరిశ్రమ ప్రముఖులు హాజరయ్యారు.