15 April, 2026 | 9:03 AM

బహుజన రాజ్య కోసం పోరాడిన కామ్రేడ్ మారోజు వీరన్న

16-05-2025 03:52 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

తుంగతుర్తి, విజయక్రాంతి: బహుజన రాజ్యాధి కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన(Telangana state practice) కోసం పోరాటం చేసిన మహనీయుడు కామ్రేడ్ మారోజు వీరన్న  తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని కరివిరాల కొత్తగూడెం గ్రామంలో మారోజు వీరన్న 26వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బహుజన రాజ్యాధికార లక్ష్యం కోసం నిరంతరం పోరాటం చేసిన యోధులు కామ్రేడ్ మారోజు అని కొనియాడారు. కుల వివక్ష నిర్మూలన కోసం నిరంతరం శ్రమించినాడని అని అన్నారు. కొత్తగూడెంలో మారోజు వీరన్న స్మృతి చిన్నం ఏర్పాటుకు స్థలం మంజూరు చేయడం కృషి చేస్తానని అన్నారు. ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మారోజు వీరన్న సతీమణి చైతన్య కుమార్తె దిశా దైద వెంకన్న ,ఏడుకొండలు, నాగరాజు,  బిక్షం ,రాములు, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు పోలేపాక రామచంద్రు, మాన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు