calender_icon.png 17 May, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పై పల్టీలు కొట్టిన కారు

16-05-2025 04:46:19 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): లంగర్ హౌస్ ఫ్లైఓవర్ పై ఓ కారు పల్టీలు కొట్టింది. మెహిదీపట్నం నుంచి లంగర్ హౌస్ వెైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  కానీ ఘటనలో కారు నుజ్జునుజ్జు కావడంతో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయి. దీంతో కారులోని వ్యక్తికి ఎలాంటి ప్రాణహాని జరుగలేదు కానీ తీవ్ర గాయలు కావడంతో చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.

కారును మాత్రం పోలీసులు క్రేన్ సాయంతో పీఎస్ కు తరలించారు. ఈ ఘటనతో ఫ్లైఓవర్ పై భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు క్లీయర్ చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకోని మద్యం సేవించి డ్రైవింగ్ చేశాడా.. లేక అతివేగం వల్ల ప్రమాదం జరిగింద అనే కోణంలో దర్యాపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.