14-02-2026 08:42:32 PM
కామ్రేడ్ బత్తిని రాములు అమరహై: పారేపల్లి శేఖర్ రావు
గరిడేపల్లి,(విజయక్రాంతి): స్వర్గీయ కామ్రేడ్ బత్తిని రాములు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పారెపల్లి శేఖర్ రావు అన్నారు. శనివారం మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలో బత్తినిరాములు 27 వర్ధంతి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పొనుగోడు కోదండరామ పురం కూతుబుషాపురం వేలిదండ గ్రామాల్లో అందె నర్సయ్య సుందరి బసవయ్య తో సమానంగా ఉంటూ పోరాటాల్లో పాల్గొన్నారని అన్నారు.రాములు హుజుర్నగర్ డివిజన్ కార్యదర్శిగా ఉమ్మడి నల్గొండ జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేశారని పేర్కొన్నారు.
తను నమ్మిన సిద్ధాంతం కోసం తుది వరకు పోరాడిన వ్యక్తి అని ఆయన పార్టీకి చేసిన సేవలను కొని యాడారు. అనంతరం అయన స్తూపనికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి షేక్ యాకోబు, సీనియర్ నాయకులు తుమ్మల సైదయ్య, అంబటి బిక్షం,దోసపాటి బిక్షం, పులిచింతల వెంకట్ రెడ్డి, చామకూరి వెంకటప్పయ్య, మండవ సైదులు, సారెడ్డి సైదిరెడ్డి, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు