calender_icon.png 14 February, 2026 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ లో ఎమ్మెల్యే విజ్జన్న చిత్రపటానికి పాలాభిషేకం

14-02-2026 08:38:35 PM

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): పెద్దపల్లి, సుల్తానాబాద్ రెండు మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం పెద్దపల్లి  ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చేసిన కృషి ఫలితమే అంటూ సుల్తానాబాద్ పట్టణంలోని పూసల రోడ్ లో మాజీ జెడ్పిటిసి సభ్యులు డాక్టర్ అయిల రమేష్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంతకు ముందు పెద్ద ఎత్తున బాణాసంచ పేల్చి సంబరాలు జరిపారు.

  ఈ కార్యక్రమం లో నాయకులు గూడ రమేష్ శర్మ, పెగడ పరశురాములు, ఆవుల శివ, శ్రీనివాస్, పిట్టల ఎల్లయ్య పల్లికి చెందిన అశోక్, కొయ్యడ రమేష్ గౌడు, జూదం ప్రకాష్  తో పాటు  పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయిల రమేష్ మాట్లాడుతూ... ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు రెండు సంవత్సరాలలోనే రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో  కోట్లాది రూపాయలతో చేసిన అభివృద్ధి పనుల కు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టారని అన్నారు, ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఎమ్మెల్యే విజయ రమణారావు ఆర్నిశలు శ్రమించడం అభినందనీయమని ఆయిల రమేష్ ఎమ్మెల్యే సేవలను కొనియాడారు.