09-09-2025 12:48:35 AM
కలెక్టరేట్ గేట్లు ఎక్కి, ఛాంబర్‌లోకి వెళ్లిన పెన్షనర్లు, దివ్యాంగులు
మంచిర్యాల, సెప్టెంబర్ 8 (విజయక్రాం తి): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు రూ.6 వేలు, వితంతువులకు, వృద్దులకు, ఒంటరి మహిళలకు రూ. 4 వేలు పెన్షన్ పెంచి ఇవ్వాలని సోమవారం కలెక్టరేట్ ముందు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు గేట్లు వేసి నిలువరించారు.
అందరికి అనుమతి ఉండదనడం తో తమ సమస్యను ఎలాగైనా కలెక్టర్ కు విన్నవించాలని ఆందోళనకారులు కలెక్టరేట్ గేట్లు, గోడ ఎక్కి నిరసన తెలిపి లోనికి ప్రవేశించారు. అప్పటికే ప్రజావాణి ముగిసి కలెక్టర్ కుమార్ దీపక్ క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. దీనితో ఆందోళనకా రు లు కలెక్టర్ ఛాంబర్‌లోకి వెళ్లి సీఎం డౌన్ డౌన్, పెన్షన్‌లు పెంచి లబ్ధిదారులు అందజేయాలని నినాదాలు చేశారు.
పెన్షన్ లు పెంచకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామ ని హెచ్చరించారు. పోలీసులు నచ్చజెప్పడంతో కలెక్టరేట్ ఏఓ రాజేశ్వర్ రావుకు విన తి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇంచార్జీ లింగంపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాదిగ, సుందిళ్ల మల్లేష్ మాదిగ, చుంచు శంకర్ వర్మ, మంతెన మల్లేష్ మాదిగ, గద్దెల బానయ్య మాదిగ, రాజన్న, గొడిసెల దశరథం, చిప్పకుర్తి మల్లేష్, వీహెచ్పీఎస్ నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు, వృద్దులు, వికలాంగులు, పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు.