09-09-2025 12:54:57 PM
మంగపేట,(విజయక్రాంతి): అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని జిల్లా ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కళా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కళా ఉత్సవ పోటీలు నిర్వహించారు పాఠశాల విద్యార్థులు డ్రాయింగ్ పెయింటింగ్ పాటలు నృత్య ప్రదర్శనల పోటీలలో పాల్గొన్నారు. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా స్థాయిలో జరిగే కళా ఉత్సవ కార్యక్రమానికి పంపడం జరుగుతుందని విద్యాశాఖ అధికారిని పోదెం మేనక అన్నారు.