calender_icon.png 9 September, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న రేష‌న్ బియ్యం ప‌ట్టివేత

09-09-2025 01:16:42 PM

250. క్వింటాల్ 

మునిపల్లి:  అక్రమంగా తరలిస్తున్న 250 క్వింటాల రేషన్ బియ్యాన్ని  మునిపల్లి పోలీసులు ప‌ట్టుకున్నారు. ఇందుకు సంబంధించి మునిప‌ల్లి ఎస్ఐ రాజేష్ నాయ‌క్ (Munipalli SI Rajesh Nayak) తెలిపిన వివ‌రాలు  ఇలా ఉన్నాయి. ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రం విజ‌య వాడ నుంచి  గుజ‌రాత్ కు అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న‌ట్లు  స‌మాచారం  అంద‌డంతో  మునిప‌ల్లి మండ‌లం కంకోల్ టోల్ ప్లాజా వ‌ద్ద మునిప‌ల్లి  పోలీసులు వాహ‌నాల త‌నిఖీ చేశారు. ఈ క్ర‌మంలో ఓ  లారీని త‌నిఖీ చేయ‌గా అందులో  ఎలాంటి ప‌త్రాలు లేకుండా  250క్వింటాళ్ల  రేష‌న్ బియ్యం ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేర‌కు  ప‌ట్టు బ‌డిన  250 క్వింటాళ్ల  రేష‌న్ బియ్యం తోపాటు లారీ ని  సీజ్ చేసి  బియ్యాన్ని స్వాధీనం చేసుకొని  స‌ద‌రు డ్రైవ‌ర్ పై కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు ఎస్ఐ రాజేష్ నాయ‌క్ తెలిపారు.