09-09-2025 12:56:52 PM
మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు పోలసాని సరళ రాణి
మంగపేట,(విజయక్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపే నా లక్ష్యంగా కృషి చేస్తానని కమలాపురం గ్రామ కాంగ్రెస్(Kamalapuram Village Congress) మహిళా ఉపాధ్యక్షురాలు పోలసాని సరళ రాణి అన్నారు.ఈ సందర్భంగా సరళ రాణి మాట్లాడుతూ కమలాపురం గ్రామ మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా నియమించినందుకు ముందుగా మంత్రి సీతక్కకు(Minister Seethakka), జిల్లా మహిళా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి,మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి, మండల మహిళా అధ్యక్షురాలు శానం నిర్మలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభుత్వం అమలుచేస్తన్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని అన్నారు.