calender_icon.png 9 September, 2025 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లు బాగు చేయండి మహాప్రభో

09-09-2025 12:53:31 PM

సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి దావూద్

మంగపేట,(విజయక్రాంతి): రోడ్లు బాగు చేయండి(Road repairs) మహాప్రభో అని ఎన్నిసార్లు ఎన్ని పత్రికల్లో ప్రచురితమైన అధికారుల స్పందన మాత్రం శూన్యం ఏటూరునాగారం బూర్గంపాడు ప్రధాన జాతీయ రహదారి(Main national highway) కనీస మరమ్మత్తులు చేయలేని  ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై సోమవారం చేసిన దాదాపు రెండు గంటల పాటు చేసిన ధర్నాలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నాలో సిపిఎం పార్టీ ములుగు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి దావూద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక లారీలకు విచ్చలవిడిగా అనుమతి ఇచ్చి రహదారులు పాడవడానికి ప్రధాన కారణం ఇసుక దోపిడీ ద్వారా ప్రభుత్వానికి కోట్ల కొద్ది ఆదాయం వస్తుందని దీనిపై ఉన్న చిత్తశుద్ధి రోడ్లు బాగు చేయడంపై లేదని అన్నారు.

రోడ్లపై మోకాళ్ళ లోతు గుంతలో పడి ప్రమాదాలకు  గురవుతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఇసుక లారీలను అదుపు చేసి రోడ్డు మరమ్మత్తులు త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల సీనియర్ నాయకులు ఎన్ఎస్ ప్రసాద్  ఎల్ పి ముత్యాలు సిఐటియు మండల నాయకులు మడే రవి ఆదివాసి గిరిజన సంఘం జిల్లా నాయకులు పూనెం నాగేష్ కుర్సం చిరంజీవి తోలేం కృష్ణ  మంగయ్య ఉప్పలపాటి రామారావు దేవయ్య జాన శేఖర్ పాల్గొన్నారు.