calender_icon.png 9 September, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాత్కాలిక రోడ్డునైనా పకడ్బందీగా వేయలేరా?

09-09-2025 12:49:27 AM

- బ్రిడ్జి పనులు యుద్ధప్రాతి పదికన కొనసాగేనా

- రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు

గంభీరావుపేట, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేటలింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగుపై తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు (బ్రిడ్జి) ఇటీవలి భారీ వర్షాలతో వరద ప్రవాహానికి రెండోసారి కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనుల కో సం పాత బ్రిడ్జిని కూల్చివేసి తాత్కాలికంగా మట్టి రోడ్డు వేసినప్పటికీ, పనులు ఆశించినంత వేగంగా సాగకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రహదారి తెగిపోవడంతో గంభీరావుపేట చేరుకో వడానికి లింగన్నపేట, మల్లారెడ్డిపేట మీదు గా పొడవైన దూరం తిరగవలసి వస్తోంది. ఉద్యోగులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు ప్ర తిరోజూ రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కూడా మానేరు వాగు పొంగిపొర్లడంతో మట్టి రహదారి కొట్టుకుపోయిన విషయం స్థానికులు గుర్తు చేస్తున్నారు.

కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మం జూరు చేసి పనులు ప్రారంభించినా ఇంకా పూర్తి కాలేదు. వరదలు తగ్గిన వెంటనే తా త్కాలిక రాకపోకలకు సదుపాయం కల్పించాలని, కనీసం మట్టి రోడ్డునైనా పకడ్బందీగా వేసి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. శా శ్వత హైలెవల్ బ్రిడ్జి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల చిరకాల కోరిక తీర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.