వేసవి క్రీడా శిక్షణ ముగింపు
జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిబించిన విద్యార్థులను సన్మానించిన వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్, మే 9 (విజయక్రాంతి): ఉట్నూర్ మండలం మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్ లో వేసవి క్రీడా శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. శనివారం జాతీయ స్థాయిలో క్రీడలు ఆడిన విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి,స్పోర్ట్స్ కోట ఉద్యోగాలు సాధించినా వారు మంచి స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు .ప్రజా ప్రభుత్వం నేటి యువతను ,విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తుంది అన్నారు. క్రీడా శిక్షణ కల్పించడంలో కోచ్ ల పాత్ర కీలకం అన్నారు,ప్రభుత్వం క్రీడా విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది అన్నారు. క్రీడా జిల్లా అధికారి పార్థసారథిని సన్మానించారు. ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఏజెన్సీ డీఈవో గొడం చందన్,అధికారులు పార్థసారధి , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






