4 July, 2026 | 10:14 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

కల్తీకల్లు తాగి 68 మందికి అస్వస్థత!

09-04-2025 12:00 AM

ఆందోళనకరంగా 15 మంది పరిస్థితి

నస్రుల్లాబాద్ మండలంలోని 4 గ్రామాల్లో బాధితులు

ఘటనపై విచారణ చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆదేశం

కామారెడ్డి, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో కల్తీకల్లు ఏరులై పారుతున్నది. కల్తీకల్లు తయారీదారులకు ఎక్సైజ్ అధికారులు, ఖద్దర్ చొక్కాల లీడర్ల అండ ఉండటంతో కల్తీకల్లును యథేచ్ఛగా తయారుచేసి పేదల ప్రాణాలతో చెలగాటమాడు తున్నారు. మంగళవారం బాన్సువాడ ని యోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండలం దురిక్కీ అంకుల్ తండా, అంకుల్, హాజీపూ ర్, సంగ్యం గ్రామస్థులు కల్తీకల్లు సేవించి అస్వస్థతకు గురయ్యారు. మతిస్థిమితం కోల్పోయి పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. 68 మందిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. 15 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నిజామాబా ద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అం దిస్తున్నారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ ఆదేశా లు జారీ చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తెలిపారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారావు బాధితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కల్తీకల్లు అమ్మినవారిపై కేసు నమోదు చేసి వారి లైసెన్స్ రద్దు చేయనున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నరసింహారావు తెలిపారు.

కల్తీక ల్లు విక్రయించిన దుకాణాలను సీజ్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కాగా బాధితులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరే షన్ చైర్మన్ కాసుల బాలరాజు పరామర్శించారు. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం, మామూ ళ్ల మత్తు వల్లనే కల్తీకల్లు విచ్చలవిడిగా అమ్ముతున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపి స్తున్నారు. కల్తీకల్లును నిరోధించడానికి టా స్క్‌ఫోర్స్ అధికారులచే తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.