calender_icon.png 2 May, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుస్సేన్ సాగర్‌లో దూకి యువతి ఆత్మహత్యాయత్నం

09-04-2025 12:00:00 AM

కాపాడిన హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 8(విజయక్రాంతి)  : హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువతిని హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందం మంగళవారం కాపాడింది. నగరంలోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్‌గాంధీ కాలనీలో నివసిస్తున్న మెర్రీ అనే మహిళ కుటుంబ కలహాలతో హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు హైడ్రా డీఆర్‌ఎఫ్ బృందానికి సమాచారం ఇవ్వడంతో డీఆర్‌ఎఫ్ సిబ్బంది వెంట నే రంగంలోకి దిగారు. తాళ్ల సహాయం తో ఆమెను సురక్షితంగా బయటకు తీసి కాపాడారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు.