22-07-2025 06:40:15 PM
నిర్మల్ (విజయక్రాంతి): సిపిఎం నేత కేరళ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ అచ్యుతానందన్(V. S. Achuthanandan) మృతి పట్ల సిపిఎం పార్టీ మంగళవారం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ నేతలు, కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగులు కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని నాయకులు పసియుద్దీన్ శంభు తిలక్ దిగంబర్ తదితరులు పేర్కొన్నారు.