calender_icon.png 23 July, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డ్ అంటే ఆహార భద్రత

22-07-2025 06:49:15 PM

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి..

బాన్సువాడ (విజయక్రాంతి): రేషన్ కార్డు అంటే ఆహార భద్రత అని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి(Agricultural Advisor Pocharam Srinivas Reddy) అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూర్ లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారిని కోటగిరి రుద్రూరు మండలాలకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.

రాష్ట్రంలో ఆరు లక్షల 12 వేల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హాయంలో గృహలక్ష్మి కింద ఇల్లు కట్టుకున్న వారికి బిల్లులు రాకపోతే ఇందిరమ్మ ఇండ్ల కింద మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇల్లు కట్టుకొని బీస్మెంటు వరకు బిల్లు వచ్చిన వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి బిల్లులు చెల్లించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహంతి, వివిధ మండలాల ప్రజా ప్రతినిధులు, మండలాల అధికారులు పాల్గొన్నారు.